Tue Nov 19 2024 23:17:46 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి కిలోపై రూ. 300లు తగ్గింది
బంగారాన్ని పెట్టుబడిగా భావించడం వల్లనే దానికంత డిమాండ్ ఉంది. ఆభరణాలుగా చూసినంత కాలం బంగారం ధరల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఎప్పుడయితే పెట్టుబడిగా భావించి కొనుగోలు చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచే అనూహ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. నిజానికి 2008 వరకూ బంగారాన్ని ఎవరూ పెట్టుబడిగా చూడలేదు. అప్పుడు పది గ్రాముల బంగారం ధర 15 వేలు ఉండేది. కేవలం పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే బంగారం కొనుగోలు చేయడం ఉండేది. కానీ రానురాను బంగారం కొనుగోళ్లకు సీజన్ లేకుండా పోయింది. అందుకే బంగారానికి డిమాండ్ పెరిగి ఇప్పుడు దాదాపు 48 వేల రూపాయలకు చేరుకుంది.
వెండి మాత్రం....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి కిలోపై రూ. 300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,140 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,00 రూపాయలు ఉంది.
Next Story