Wed Nov 20 2024 09:11:23 GMT+0000 (Coordinated Universal Time)
మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం
దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం పది గ్రాములకు వెయ్యి రూపాయల వరకూ పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది
బంగారం అంటేనే క్రేజ్. అందునా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. మామూలుగానే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటి ధరలకు ఎప్పుడూ రెక్కలుంటాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు దాని ధరలపై ప్రభావం చూపుతాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరిగే యుద్ధం ప్రభావం కూడా బంగారం ధరలపై చూపుతుంది. గత కొద్ది రోజులుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నట్లే బంగారం ధర భారీగానే పెరిగింది.
అదే బాటలో వెండి....
దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం పది గ్రాములకు వెయ్యి రూపాయల వరకూ పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49, 400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,890 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 75,700 రూపాయలుగా ఉంది.
Next Story