Sun Nov 17 2024 06:41:30 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ ఫర్ గోల్డ్ లవర్స్
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకరకంగా ఇది పసిడిప్రియులకు ఊరట కలిగించే వార్తే
బంగారం ధరలు తగ్గినా పసిడిప్రియులకు తీపికబురే. పెరగకుండా స్థిరంగా ఉన్నా గుడ్ న్యూస్ కిందే అనుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలు పెరగకూడదనే అందరూ కోరుకుంటారు. కానీ డిమాండ్ ఆధారంగా వాటి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అందుకే తగ్గినప్పుడు కాని స్థిరంగా ఉన్నప్పుడు కాని బంగారం కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయినా ఒకరోజు స్థిరంగా ఉన్నాయని సంతోషపడటానికి వీలులేదు. రేపు బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.
స్థిరంగా వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకరకంగా ఇది పసిడిప్రియులకు ఊరట కలిగించే వార్తే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,330 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,800 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 73,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
Next Story