Tue Dec 24 2024 12:47:42 GMT+0000 (Coordinated Universal Time)
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. పెరిగిన కొనుగోళ్లు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,560 గా ఉంది.
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు సహజం. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. రెండ్రోజులు స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గగా.. కిలో వెండి ధరపై రూ.400 తగ్గింది. ఈరోజు (మే23) ఉదయం 6 గంటల వరకూ నమోదైన వివరాల ప్రకారం.. నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,560 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56, 290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410గా ఉండగా.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.56,290 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,410 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండిపై రూ.400 తగ్గడంతో.. ప్రస్తుతం వెండి ధర రూ.78,600 గా ఉంది.
కాగా.. ఇటీవల ఆర్బీఐ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆ నోట్లను ఉపయోగించి బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆన్ లైన్ లో పేమెంట్లు చేసినవారు కూడా.. లాకర్లలో దాచిన 2000 నోట్ల కట్టలు పట్టుకుని బంగారం, వజ్రాల షాపులకు క్యూ కడుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ.60వేలు దాటినా.. కొనేందుకు వెనుకాడటం లేదు. వ్యాపారస్తులు కూడా ఈ సమయాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. రూ.2000 నోట్లతో కొనుగోళ్లు ఎక్కువగా అవుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న ధరపై రూ.5 వేలు పెంచి మరీ బంగారం అమ్ముతున్నట్లు సమాచారం.
Next Story