Mon Dec 23 2024 14:22:49 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,440, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,740 గా ఉంది. ఆర్థిక రాజధాని ..
హైదరాబాద్ : రెండ్రోజులుగా బంగారం, వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. నేటి వెండి, బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,440, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,740 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ. 46,250, 24 క్యారెట్లు రూ.50,450 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా స్థిరంగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450 గానే ఉంది.
తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450కి తగ్గింది.
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరు, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.63,500కి తగ్గింది. కోల్ కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కేజీ వెండి ధర రూ.59,400గానే ఉంది.
Next Story