Mon Nov 18 2024 00:35:51 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే?
బంగారం భారతీయ కుటుంబాల్లో భాగమై పోయినందున ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది
బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి వాటి ధరలు నిర్ణయిస్తారు. ఎప్పుడు డిమాండ్ అధికంగా ఉంటుందీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది అన్నది మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు కూడా బంగారం ధరల్లో మార్పునకు కారణాలుగా చెప్పాలి. బంగారం భారతీయ కుటుంబాల్లో భాగమై పోయినందున ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సయితం సూచిస్తారు. పెట్టుబడిగా చూడటం, బంగారాన్ని తమ మేనిపై ఒక విలువైన వస్తువుగా మహిళలు భావిస్తుండటంతోనే ఎప్పటికప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి తగ్గుతుంటాయి.
తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.230 తగ్గింది. కిలో వెండి పై రూ.900లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 45,800 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.60,700 రూపాయలుగా ఉంది.
Next Story