Tue Nov 05 2024 12:43:01 GMT+0000 (Coordinated Universal Time)
బాగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.350 పడిపోగా.. 10 గ్రాములకు ఇప్పుడు
గురువారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.55,400 ఉండగా, నేడు 350 తగ్గడంతో రూ.55,050గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర నిన్న రూ.60,450 ఉండగా, నేడు రూ.400 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,050 గా ఉంది. కొద్దిరోజుల కిందట బంగారం ధరలు వరుసగా పెరిగి.. గరిష్ట ధరలను తాకాయి. మళ్లీ కొద్దిరోజులుగా బంగారం ధర పడిపోతుంది. తాజాగా మరోసారి భారీగా కుప్పకూలింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1936 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 23.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ రూ. 81.99కి పుంజుకుంది.
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.350 పడిపోగా.. 10 గ్రాములకు ఇప్పుడు రూ.55,050 మార్కుకు చేరింది. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.400 పతనం కాగా.. రూ.60,050 మార్కు వద్ద చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 350 పడిపోయి రూ. 55,200 మార్కుకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,200 మార్కు వద్ద ఉంది. హైదరాబాద్లో వెండి భారీగా దిగొచ్చింది. తాజాగా ఒక్కరోజులోనే రూ.700 పడిపోయి కిలో వెండి రేటు రూ.78,500 వద్ద ఉంది.
Next Story