Mon Dec 23 2024 16:25:01 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధర తగ్గుతోందోచ్
హైదరాబాద్లో నేడు 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల రేటు వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం
బంగారం ధరలు దిగివస్తూ ఉండడంతో కొనాలనుకుంటున్న వారికి కాస్త ఊరట కలగనుంది. వెండి రేటు క్రితం సెషన్లో ఏకంగా రూ.5300 మేర తగ్గింది. తాజాగా స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పడిపోతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా వేసిన క్రమంలో ఓ స్థాయిలో బంగారం ధరలు పెరిగినట్లు కనిపించినా మళ్లీ పడిపోతున్నాయి.
హైదరాబాద్లో నేడు 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల రేటు రూ.55 వేల100 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ తులానికి ప్రస్తుతం రూ.60 వేల 110 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55 వేల 260 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60 వేల 260 మార్కు వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో సిల్వర్ రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో ధర రూ.73,500 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతూ రూ.73,500 మార్కు వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వాయిదాతో డాలర్ తగ్గినట్లు కనిపించినా దాంతో పాటు బంగారం రేటు సైతం తగ్గుతూ వస్తోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1955 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ గ్లోబల్ మార్కెట్లో ఇవాళ కాస్త పుంజుకుని రూ.81.938 వద్ద అమ్ముడవుతోంది.
Next Story