Mon Dec 23 2024 15:27:00 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్.. కానీ..!
శనివారం నాడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై
శనివారం నాడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 310 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటాయన్న సంగతి తెలిసిందే..!
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా ఉంది.
వెండి ధరలలో కాస్త పెరుగుదల కనిపిస్తూ ఉంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 79,000లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధర రూ. 600 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 82,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 82,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉండగా, చెన్నైలో రూ. 82,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,000 గా నమోదైంది.
Next Story