Mon Dec 23 2024 16:37:55 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాడ్ న్యూస్ మీకే..!
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. నేడు బంగారం ధర పెరిగింది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర ఈరోజు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,100 ఉండగా, నేడు 250 పెరగడంతో గోల్డ్ ధర రూ.55,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,110 ఉండగా, నేడు 270 పెరగడంతో గోల్డ్ ధర రూ.60,380గా ఉంది. కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి రూ.77,000 లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,500 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,530 గా నమోదైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.60,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల ధర రూ.60,380 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,650, 24 క్యారెట్లు రూ.60,710 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 లు ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000 లుగా కొనసాగుతోంది. ముంబైలో రూ.77,000, చెన్నైలో రూ.80,000, బెంగళూరులో రూ.75,500 లుగా నమోదైంది.
Next Story