Sat Nov 23 2024 11:36:33 GMT+0000 (Coordinated Universal Time)
షాకిస్తున్న బంగారం
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరగగా.. రూ. 55,000కి చేరింది.
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరగగా.. రూ. 55,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 54,650గా ఉండేది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,500గా కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000గా నమోదైంది. 24 క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర రూ. 380 పెరగడంతో రూ. 60,000కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,150గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 60,000గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 55,370గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,400గా ఉంది. దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 2వేలు పెరిగి రూ. 75,600గా కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 75,600.. బెంగళూరులో రూ. 74,500గా ఉంది.
Next Story