Mon Nov 18 2024 02:51:47 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు పైపైకి
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారంపై ,ూ.240లు పెరిగింది. వెండి కిలో ధరపై రూ.600లు పెరిగింది.
భారతీయ కుటుంబాల్లో బంగారం ఒక భాగమయిపోయింది. ధరలతో సంబంధం లేకుండా ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో దాని మార్కెట్ కూడా పెరిగింది. ఒకప్పుడు దాని విలువైన వస్తువుగా చూశారు. కానీ రాను రాను ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో బంగారం కూడా సాధారణ వస్తువులా తయారయింది. అయితే బంగారానికి ఉన్న విలువ మాత్రం తగ్గలేదు. బంగారం తమ వద్ద ఉంటే కష్టకాలంలో ఉపయోగపడుతుందన్న భావన ఎక్కువ శాతం మంది ప్రజల్లో ఉంటుంది. అందుకే బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారంపై ,ూ.240లు పెరిగింది. వెండి కిలో ధరపై రూ.600లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,200 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,000 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి 63,300 రూపాయలు ఉంది.
Next Story