Mon Nov 18 2024 06:38:12 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధర
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మాత్రం పెరిగింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి
బంగారం అంటే అంతే మరి. ఎప్పుడు ధర పెరుగుతుందో? తగ్గుతుందో చెప్పలేం. ఎంత ధరలు పెరిగిన బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. బంగారం అంటేనే భారతీయ మహిళలు మక్కువ చూపిస్తారు. బంగారం అంటే పిచ్చి అనే చెప్పాలి. డబ్బులుంటే చాలు బంగారాన్ని కొనుగోలు చేయడానికే ముందుంటారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతుండటంతో దీనిని పెట్టుబడిగా కూడా అనేక మంది చూస్తున్నారు. అవసరానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా...
అయితే ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మాత్రం పెరిగింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 51,000లుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 46,750లు పలుకుతుంది. ఇక కిలో వెండిపై ఈరోజు రూ.200లు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి 61,400 రూపాయలకు చేరుకుంది.
Next Story