Fri Nov 15 2024 10:43:27 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్ గుడ్న్యూస్
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 400 రూపాయలు తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది.
బంగారం కొనాలనుకుంటున్న వారు ధరలను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఒకప్పుడు బంగారాన్ని అవసరం కోసం కాకుండా ఆడంబరాల కోసం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వేరు. అవసరం ఉంటేనే జ్యుయలరీ షాపులవైపు చూస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలైతేనే బంగారం కొనుగోలు చేస్తున్నారు. అంతే తప్ప తాము ఉన్న కొద్ది పాటి సొమ్ముతో బంగారం కొనుగోలు చేయాలని ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే కొద్ది మొత్తంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాగే పెట్టుబడిగా భావించే వారు మాత్రం ఎప్పుడూ ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారానికి వన్నె ఎఫ్పుడూ తగ్గనట్లుగా డిమాండ్ కూడా తగ్గదంటారు. అయితే వేర్వేరు కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
భారీగా వెండి...
తాజాగా ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 400 రూపాయలు తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది. వెండి కిలో ధరపై 2,600 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,690 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 78,700 రూపాయలకు చేరుకుంది.
Next Story