Sun Nov 17 2024 20:45:38 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలంటే ఇప్పుడే మరి
వరసగా మూడో రోజూ బంగారం ధర తగ్గింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది
బంగారం అంటేనే ప్రతి ఒక్కరికీ మక్కువే. అందునా భారతీయ మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది ఏది అంటే ఎవరైనా టక్కున బంగారమనే చెబుతారు. బంగారం ఆభరణాలుగా కాకుండానే పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందని మొన్నటి కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ తెలిసి వచ్చింది. అప్పటి నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి.
మూడో రోజు కూడా...
వరసగా మూడో రోజూ బంగారం ధర తగ్గింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. స్వల్పంగా తగ్గినా ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిది. ఇదే విషయాన్ని మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారంకు రూ.115ల వరకూ తగ్గింది. కిలో వెండి పై రూ.1,000 లు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,890 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర రూ.63,000లుగా ఉంది.
Next Story