Sun Nov 17 2024 12:18:27 GMT+0000 (Coordinated Universal Time)
మగువలు ఇష్టపడే వార్త
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.170లు తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పసిడి అంటే ఇష్టపడే వారు భారత్ లో అత్యధికంగా ఉన్నారు. అందుకే ప్రపంచంలోనే భారత్ పసిడి దిగుమతిలో రెండో స్థానంలో ఉంది. డిమాండ్ అధికంగా ఉండటం, ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తుండటంతో బంగారం అత్యధిక మొత్తంలో దిగుమతి చేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అయినా భారత్ లో కొనుగోళ్లు ఆగడం లేదు. అందుకే ఇష్టపడే వాళ్లు ఎక్కువ కావడంతో డిజైన్లు కొత్తకొత్తవిగా మార్కెట్ లో విడుదల చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.
భారీగా పెరిగిన వెండి...
తాజాగా ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.170లు తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి పై రూ.600లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,750 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,350 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 67.000 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story