సీజన్లో రిలీఫ్
ఈరోజు దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
గోల్డ్ స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎంత బంగారం ఉంటే అంత గౌరవం దక్కుతుందన్న భావనతో కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. దీంతో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కొందరు పెట్టుబడిగా చూస్తున్నా, మరికొందరు స్టేటస్ సింబల్ గా చూస్తుండటంతో గోల్డ్ కొనుగోళ్లు ఎంత ధరలు పెరిగినా ఆగడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా మారడంతో గోల్డ్ పర్ఛేజ్ తప్పనిసరి అయింది. అందుకే ధరలు పెరిగినా వ్యాపారులు మాత్రం దిగుమతులను ఆపడం లేదు. కొత్త కొత్త రకాల ఆభరణాలను తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.