హమ్మయ్య... బంగారం ధరలు దిగివచ్చినట్లే
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.120లు తగ్గింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం అంటేనే భారంగా మారిన రోజులివి. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో బంగారం సామాన్యులకు భారంగా మారిపోయింది. బంగారం కొనాలంటేనే గగనమయిపోయింది. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి భారతీయులు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. బంగారం ధర తగ్గినప్పుడు వెంటనే కొనుగోలు చేసే వారు కొందరైతే, పెట్టుబడిగా చూసే వారు మరికొందరు. కేంద్ర బ్యాంకుల బంగారం వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారు కూడా ఎక్కువ కావడంతో ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులు తగ్గించడంతో డిమాండ్ కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.