Fri Nov 15 2024 15:24:04 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్.. వీనులవిందైన వార్తే కదూ
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వీకెండ్ ధరలు తగ్గడంతో కొంత గోల్డ్ లవర్స్‌కు ఊరట కలిగించింది.
బంగారం ధరలు తగ్గాయంటే చాలు ఇక పోలో మంటూ జ్యుయలరీ దుకాణాలకు ఎగబడిపోతుంటారు మనోళ్లు. అంత బలహీనం బంగారం అంటే. ఉన్న కొద్దిపాటి మొత్తంతోనైనా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కనీసం గ్రాము బంగారాన్ని సొంతం చేసుకున్నా చాలు అనుకునే వారు అనేక మంది ఉంటారు. ఇక బంగారు ఆభరణాలు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్లు ఏం వచ్చాయో తెలుసుకుని మరీ ఆరా తీసి కొనుగోలు చేస్తుంటారు. కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి విడుదలయిన వెంటనే తమ రెగ్యులర్ కస్టమర్లకు వాట్సప్ ద్వారా జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం పంపుతుంది. వెంటనే దాని కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటారు. ఇటీవల బంగారం ధరలు పెరుగుతుండటంతో కొంత కొనుగోలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఏ మాత్రం ధరలు తగ్గినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు చాలా మందే ఉంటారు. వారి కోసమే బంగారం నగలు జ్యుయలరీ దుకాణాల్లో ఎదురు చూస్తుంటాయి.
తగ్గిన ధరలు ఇలా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వీకెండ్ ధరలు తగ్గడంతో కొంత గోల్డ్ లవర్స్‌కు ఊరట కలిగించింది. వెండి ధరలు కూడా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు తగ్గింది. కిలో వెండి ధర రూ.300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55.750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,820లుగా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 80,000 రూపాయలకు చేరుకుంది.
Next Story