Mon Nov 18 2024 22:11:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర
దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం అంటేనే బంగారం.. దానికి ఎవరూ సాటి రారు. ప్రతి ఇంట్లో విలువైన వస్తువుగా మారింది. సంస్కృతి సంప్రదాయాల్లో బంగారం భాగంగా మారింది. భారతీయులు అమితంగా ఇష్టపడే వస్తువుల్లో బంగారం ఒకటిగా మారింది. ఎవరైనా సరై డబ్బులు కొద్దిగా కూడబెట్టుకుంటే చాలు బంగారాన్ని కొనగోలు చేయాలని ఆలోచించడం ప్రారంభమయినప్పటి నుంచే దాని డిమాండ్ అధికమయింది. అందుకే బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయంటారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద నిల్వలు వంటి కారణాలు కూడా బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు ఉండటానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతారు. సీజన్లతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే ఒకే ఒక వస్తువు బంగారం.
తగ్గిన వెండి ధర...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉంది. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,200 రూపాయలుగా ఉంది. శ్రావణ మాసం దగ్గరపడటంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగి, దాని ధర కూడా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Next Story