Tue Nov 19 2024 04:30:14 GMT+0000 (Coordinated Universal Time)
పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు పెరిగింది. కిలో వెండిపై రూ.1200 లు తగ్గింది
బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో బంగారం ధర రానున్న రోజుల్లో పెరుగుతుందని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్యణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు కూడా బంగారం ధరల్లో మార్పునకు కారణంగా చెబుతున్నారు. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బంగారానికి రానున్న రాజుల్లో రెక్కలు రావడం ఖాయమంటున్నారు. అందుకే మదుపరులు ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో...
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు పెరిగింది. కిలో వెండిపై రూ.1200 లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,340 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 63,500 రూపాయలుగా ఉంది.
Next Story