Sun Nov 17 2024 12:48:17 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. బంగారం ధరలు...?
దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం పది గ్రాముల పై మూడు వందలు పెరిగింది
బంగారం, వెండి అంటే భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. ఒకనాడు విలువైన వస్తువులు నేడు అవసరమైనవిగా మారిపోయాయి. పేద, మధ్యతరగతి, ధనికులు అన్న తేడా లేకుండా బంగారం కొనుగోళ్లుపై ఇష్టపడటంతో దాని డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అందుకే అధికమొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ నమోదయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడుదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలలో ఎప్పటికప్పడు మార్పులు చోటు చేసుకుంటుండటం మామూలే. గత కొద్ది రోజులుగా స్వల్పంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనగుగోలుదారులు కొంత ఊరట చెందారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు జరగుతాయని వ్యాపారులు కూడా కొత్త కొత్త డిజైన్లతో తమ దుకాణాలకు కొత్త సొబగులను అద్దారు.
వెండి కూడా....
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం పది గ్రాముల పై మూడు వందలు పెరిగింది. అలాగే వెండి కిలో పై రూ.120ల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,970 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,550 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో 68,200 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story