Mon Nov 18 2024 16:28:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర
దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
బంగారం అంటేనే బంగారం. దానిపై అందరికీ మక్కువ కావడంతో దానికి డిమాండ్ కూడా ఎక్కువే. భారత్ వంటి దేశాల్లో బంగారం వినియోగం అనేక రకాలుగా ఉంటుంది. మహిళలు ఆభరణాలుగా తమ ఇంటిలోని ఒక వస్తువుగా భావిస్తారు. బంగారం కొనుగోలు చేయడమంటే మహా మక్కువ చూపిస్తారు. ఇక ప్రస్తుతం శ్రావణ మాసం కావడం, పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. బంగారం చెక్కు చెదరదు. అది పెట్టుబడిగా భావించే అనేక మంది కొనుగోలు చేయడంతో జ్యుయలరీ షాపులు కళకళ లాడిపోతున్నాయి. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటుంది.
ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.440ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,090 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి పై స్పల్పంగా ధర తగ్గింది. నాలుగు వందల రూపాయల ధర తగ్గిన వెండి ప్రస్తుతం కిలో 64,400 రూపాయలుగా ఉంది.
Next Story