Sat Nov 16 2024 22:51:28 GMT+0000 (Coordinated Universal Time)
పసిడి పరుగులు ఆగడం లేదే
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వరసగా నాలుగో రోజు కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి
బంగారం ధరలు పెరుగుతున్నాయంటే గుండెలు గుభేలు మంటాయి. పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఎలా కొనాలి అంటూ పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. సంప్రదాయంలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయడం వారికి రాను రాను కష్టంగా మారింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. గత నాలుగు రోజుల్లో పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలు పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగాయా? అంటే అదీ లేదు. అప్పు చేసైనా సంప్రదాయాలను నిలబెట్టుకోవడం కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో వాటి ధర అందనంత దూరంగా వెళుతుంది.
వెండి ధర కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వరసగా నాలుగో రోజు కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి పై రూ.750లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,730లు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 75,000 రూపాయలకు చేరుకుంది.
Next Story