Sat Nov 16 2024 20:43:20 GMT+0000 (Coordinated Universal Time)
మహిళలకు షాకింగ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.170లు పెరిగింది
బంగారం ధరలు అంతే. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ మాత్రమే ధరలు తగ్గి కొంచెం ఊరట కల్గిస్తుంటాయి. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. బంగారం, వెండి అంటే మహిళలకు మక్కువ. తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. తమ తాహతును బట్టి కొనుగోలు చేసినా భారత్ లోనే ఎక్కువగా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. మిగిలిన దేశాల్లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. భారత్ లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది దక్షిణాది రాష్ట్రాలే కావడం విశేషం. అందుకే ఇక్కడ బంగారానికి అంత డిమాండ్.
వెండి మాత్రం...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.170లు పెరిగింది. కిలో వెండిపై రూ.400లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,440 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,200 రూపాయలు పలుకుతుంది.
Next Story