Sat Nov 16 2024 22:33:53 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం భారమాయెగా
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.210లు పెరిగింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటికి అడ్డుకట్ట పడటం లేదు. పండగ రోజు నుంచి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలతో తులం బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. వినియోగదారులకు ఇది భారంగా మారనుంది. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలంటే కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంగా బంగారం ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. దీంతో మార్కెట్ కొంత డౌన్ అవుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతుంది.
స్వ్పలంగా పెరిగిన వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.210లు పెరిగింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి పై రూ.15ల0లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 75,800 రూపాయలుగా ఉంది.
Next Story