Sat Nov 16 2024 22:46:24 GMT+0000 (Coordinated Universal Time)
షాకిచ్చిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.350లు పెరిగింది.
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాదిలో తులం బంగారం 70 వేలకు చేరుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారం దిగుమతులు తగ్గడంతో డిమాండ్ తగ్గకపోవడంతో ధరలు పెరుగుతున్నాయన్నది నిపుణులు చెబుతున్న మాట ప్రకారం తెలుస్తోంది. భారత్ రూపాయి విలువ బలోపేతం చేసే యత్నంలో భాగంగా బంగారం దిగుమతులను తగ్గించిందంటున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే బంగారం దిగుమతిలో రెండో స్థానంలో ఉన్న భారత్ కొంత దిగుమతులను తగ్గించింది. డిమాండ్ కు తగ్గ బంగారం అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు. భారీగా పెరిగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.350లు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. కిలో వెండి ధరపై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,350 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,110 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,100 రూపాయలుగా ఉంది.
Next Story