Mon Nov 18 2024 22:32:41 GMT+0000 (Coordinated Universal Time)
స్టేబుల్ గా గోల్డ్ రేట్స్
గత రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. స్వల్పంగానే మార్పులు ఉన్నాయి.
బంగారం ధరలు పెరగడం, తగ్గడం మామూలే. ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బంగారం అంటేనే మహిళలకు మహా ప్రీతి. ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనేందుకు ఒక సీజన్ కూడా లేకుండా పోయింది. ఎప్పుడు డబ్బులు చేతిలో ఉంటే అప్పుడే బంగారాన్ని కొనుగోలు చేసే రోజులివి. అందుకే బంగారం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలన్నట్లుగా విరాజిల్లుతుంది. కేంద్రీయ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో బంగారం కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తగ్గిన వెండి...
ఇక గత రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. స్వల్పంగానే మార్పులు ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గిందనే చెప్పాలి. హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,100 రూపాయలుగా ఉంది.
Next Story