బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్
దేశంలో బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా పెిరగింది
బంగారం ధరలు అంతే. ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో చెబుుతన్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడం, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండటం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో బంగారం మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిపోయిందని చెప్పాలి. ఒక బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది తులం బంగారం ధర డెబ్భయి వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.