Sun Nov 17 2024 16:30:28 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది.
బంగారం అంటే అంతే మరి. ఒకసారి ధర పెరుగుతుంది. మరొకసారి తగ్గుతుంది. భారతీయులకు ఉన్న మక్కువ ఎక్కువ కావడంతో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దాని విలువ తగ్గదు. వన్నె తరగదు. అందుకే బంగారం ధరల విషయంలో కొనుగోలుదారులు ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గతంలో కొన్ని రకాల డిజైన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఈరోజు అలా కాదు. రోజుకొక కొత్త డిజైన్లతో మన ముంగిటకు వస్తున్నాయి. దీంతో మగువలు ఇష్పపడి.. కష్టపడి కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొత్త డిజైన్ల కోసం నిత్యం జ్యుయలరీ షాపుల వద్దకు పరుగులు తీయడం అలవాటుగా మార్చుకున్నారు. పెట్టుబడిగానూ చూస్తుండటంతో బంగారం మరింత ప్రియంగా మారుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి.
వెండి ధరలు...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,380 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,100 రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 63,700 రూపాయలుగా ఉంది.
Next Story