గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్
గారం ధరలు దేశంలో ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.150లు తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరిగాయి
బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిగా తగ్గినా అది ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. రానున్నది పెళ్లిళ్ల సీజన్. బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో పది గ్రాముల బంగారం డెబ్భయివేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వినిపిస్తుంది. దీంతో కొందరు ముందుగానే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులు తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత దూరమయ్యే అవకాశముంది. అందుకే తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.