బంగారం ధరలు నేడు?
బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయలు తగ్గింది
బంగారం అంటేనే భారంగా మారనుంది. బంగారం అనే వస్తువు ఇక కొందరికే పరిమితం కానుంది. బంగారం ధరలను చూసిన వారెవరైనా కొనుగోలు చేయడానికి భయపడతారు. అత్యవసరం అయితే తప్ప బంగారం దుకాణాలవైపు కన్తెత్తి చూడని పరిస్థిితి నెలకొంది. అలా బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఫలితం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఈ ఏడాదిలో తులం బంగారం70 వేల రూపాయలకు చేరుకునే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు తీస్తుంది. బంగారం భారతీయ సంస్కృతిలో భాగం కావడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకే భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదంటున్నారు వ్యాపారులు.