Sun Nov 17 2024 16:26:59 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 170 రూపాయల వరకూ పెరిగింది. వెండి కూడా స్వల్పంగా పెరిగింది
ఒకరోజు ధరలు పెరుగుతాయి. మరో రోజు తగ్గుతాయి. బంగారం అంటే అంతే మరి. మార్కెట్ లో డిమాండ్ ను బట్టి అనేక కారణాలతో ధరల పెరుగుదల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బంగారం అంటే ఇష్పపడని వారుండరు. మహిళలతో పాటు మగవారు సయితం బంగారం అంటే ఇష్టపడుతున్నారు. ఒంట మీద బంగారు ఆభరణాలు ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా భావించే రోజులివి. దీంతో పాటు పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. కష్టసమయంలో తమను ఆదుకునే ఇన్స్టెంట్ వస్తువుగా బంగారాన్ని భావిస్తుండటంతో ఎక్కువ మంది తమ వద్ద ఉన్న డబ్బులతో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 170 రూపాయల వరకూ పెరిగింది. వెండి కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,280 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధరల 63,200 రూపాయలుగా ఉంది.
Next Story