Tue Nov 19 2024 02:37:31 GMT+0000 (Coordinated Universal Time)
పసిడిప్రియులకు ఊరట
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కొనుగోలు చేస్తుంటారు. ఏమాత్రం తగ్గినా కొనుగోళ్లు పెరుగుతాయి. ధరలు పెరిగినా ఈ మధ్య కాలంలో కొనుగోలు విషయంలో ఆలోచించడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల కొంత కొనుగోళ్లు తగ్గే అవకాశాలున్నాయి. ఆషాఢమాసం కావడంతో కొనుగోళ్లు మందగిస్తాయని వ్యాపారులు సయితం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. వచ్చే నెల నుంచి మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. పెట్టుబడిగా చూసే వారు రోజురోజుకూ పెరగడంతో బంగారం కొనుగోళ్లు బాగానే ఉన్నాయంటున్నారు మరికొందరు వ్యాపారులు.
స్థిరంగా ధరలు...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,210 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,950 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 62,800 రూపాయలుగా ఉంది.
Next Story