Wed Nov 20 2024 09:37:04 GMT+0000 (Coordinated Universal Time)
బంగారానికి రెక్కలు.... పసిడి ప్రియులకు షాక్
దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా పెరిగాయి. పదిగ్రాముల బంగారంపై రూ.760లు, కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది.
మగువలు ఇష్పపడే పసిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వారు అత్యంత ఇష్టపడే బంగారం ధరకు కూడా రెక్కలు వస్తుంటాయి. అంతర్జాతీయంగా ఏ పరిణామాలు జరిగినా వాటి ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. తాజాగా రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. బంగారం ఈ యుద్ధ ప్రభావంతో 55 వేలు చేరుకుంటుందని గతంలోనే మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఆ దిశగానే బంగారం పరుగులు పెడుతోంది.
వెండి ధరలు కూడా....
దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా పెరిగాయి. పదిగ్రాముల బంగారంపై రూ.760లు, కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,400 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,800 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలో రెండు వేల మేరకు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 73,400 రూపాయలు ఉంది.
Next Story