పసిడి ప్రియులూ.. పారాహుషార్
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి కూడా పెరిగింది
భారత్లో బంగారం అంటే అదో క్రేజ్. బంగారం ఉంటే చాలు దానిని స్టేటస్ సింబల్ గా మారుస్తారు. సమాజం గౌరవిస్తుందని భావిస్తారు. అందుకే మహిళలు బంగారం కొనుగోలుకు మక్కువ చూపుతారు. కుటుంబంలో ఏ చిన్న శుభకార్యం వచ్చినా ముందు బంగారం కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలను ఆదుకున్నది కూడా బంగారమే. ఉపాధి కోల్పోయిన వారంతా బంగారాన్ని కుదువ పెట్టి రెండు నెలల పాటు బతకగలిగారంటే అందుకు పసిడి కారణమని చెప్పక తప్పదు. అందుకే కష్టకాలంలో ఆదుకునే వస్తువుగా బంగారాన్ని చూస్తారు. తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తం ఇచ్చే సంస్థలు కూడా తామరతంపరగా పల్లె నుంచి పట్టణం వరకూ విస్తరించడంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. అందుకే డబ్బులు కొద్దిపాటి ఉన్నా చాలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. కొనుగోళ్లు ఆగడం లేదు.