Sat Nov 16 2024 22:48:48 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ షాకిచ్చిన పసిడి
దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం అంటేనే భారతీయులకు మోజు. అది అపురూపమైన వస్తువుగానూ, గౌరవం ఇచ్చే ఆభరణంగా చూస్తారు. ఒంటిమీద ఎంత బంగారం ఉంటే అంత గౌరవం లభిస్తుందన్న అపోహతోనే మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. భారతీయ సంస్కృతిలో భాగంగా మారిన బంగారాన్ని కాస్త ఎక్కువ వెచ్చించైనా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. ఆభరణాలనే ఎక్కువ ఇష్పపడతారు. ఇక వెండి కూడా అంతే. ప్రతి ఇంట్లో వెండి ఒక భాగమయిపోయింది. బంగారం పెరుగుదల ఎవరూ ఆపలేరు. అది అంతర్జాతీయ మార్కెట్ లో దిగుమతులు, ఎగుమతుల మీద ఆధారపడి ఉంటుంది.
స్థిరంగా వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం వరకే నమోదయిన ఈ ధరల వివరాలను అందిస్తున్నాం. మధ్యాహ్నానికి మళ్లీ మారే అవకాశాలు లేకపోలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,110 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,700 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story