Sat Nov 16 2024 09:44:34 GMT+0000 (Coordinated Universal Time)
ఉమెన్స్ డే గిఫ్ట్ : బంగారం దిగి వచ్చింది
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.200లు తగ్గింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి
బంగారం అంటేనే భారంగా మారుతుంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు మక్కువపడే బంగారానికి మహిళ దినోత్సవం రోజు ధరలు తగ్గడం కొంత ఊరట కల్గించే అంశమే. బంగారం ధరలు తగ్గితే ఆనందపడే వారిలో మహిళలు ముందుంటారు. ఎందుకంటే బంగారం అంటే అంత పిచ్చి. డబ్బులు తమ వద్ద ఏ మాత్రం ఉన్నా వెంటనే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో ఇటీవల కాలంలో బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి స్థిరంగా...
అయితే తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.200లు తగ్గింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,350 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,000 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story