Sat Nov 16 2024 14:48:07 GMT+0000 (Coordinated Universal Time)
గోల్డ్ అంటే అంతే మరి.. కొనేయండి వెంటనే
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి
బంగారం అంటేనే భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. అందునా భారతీయ మహిళలు అత్యంత మక్కువ చూపేది బంగారంపైనే. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువ. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతుండటంతో వ్యాపారులు కూడా బంగారం దిగుమతులను ఎక్కువగా చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ మేరకు దిగుమతులు లేకపోవడంతో ధరలు పెరిగిపోవడం పరిపాటిగా మారింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. అదే కాకుండా అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.
స్థిరంగా ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,800 రూపాయలుగా నమోదయింది.
Next Story