Fri Dec 20 2024 19:49:40 GMT+0000 (Coordinated Universal Time)
పసిడిప్రియులకు ఊరట
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ.500లు పెరిగింది
బంగారం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఎంత బంగారం ఉంటే అంత స్టేటస్ ఉన్నట్లు. సమాజంలో తమకు గౌరవం బంగారాన్ని బట్టి లభిస్తుందని ఆశించి మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ప్రధానంగా భారతీయ సంస్కృతి అందులోనూ దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. పెట్టుబడిగా కూడా అనేక మంది కొనుగోలు చేస్తున్నప్పటికీ, అనేక మంది స్టేటస్ కోసమే బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు కలవర పెడుతున్నాయి. ఇటు అంత పెద్దమొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయలేక గిల్ట్ ఆభరణాలను కూడా ఆశ్రయించే వారు లేకపోలేదు. సమాజంలో గౌరవం కోసం బంగారాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అనేక మందికి పెరుగుతున్న ధరలు షాకిస్తున్నాయి.
వెండి మాత్రం....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ.500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 77,700 రూపాయలకు చేరుకుంది.
Next Story