Mon Dec 23 2024 19:42:24 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 24.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే డాలర్తో పోల్చినప్పుడు రూ.81.938 వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. 10న గ్రాముల బంగారం ధర రూ.55 వేల100 మార్కు వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం తులం రేటు ప్రస్తుతం రూ.60 వేల 110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. ఢిల్లీలో 10 గ్రామలు బంగారం రేటు 22 క్యారెట్లకు రూ. 55 వేల 260 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60 వేల 260 మార్కు వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది. సిల్వర్ ధర కిలోపై రూ.5300 పడిపోయింది. హైదరాబాద్లో సిల్వర్ రేటు కిలోపై రూ.5300 పడిపోయింది. ప్రస్తుతం కిలో రేటు రూ.73,500 మార్క్ వద్దకు దిగివచ్చింది. ఢిల్లీలో కిలో వెండి స్థిరంగా కొనసాగుతూ రూ.73,500 మార్కు వద్ద కొనసాగుతోంది.
Next Story