Sat Nov 23 2024 09:01:14 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి
అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు తాజాగా రూ. 30 మేర పడిపోయింది. దీంతో బంగారం ధర రూ.55,070 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు హైదరాబాద్‌లో తాజాగా రూ.40 తగ్గగా.. రూ.60,070 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల పాటూ బంగారం రేట్లు స్థిరంగా కొనసాగాయి.
ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.90 పెరిగి రూ.55,350కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.60,210 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో సిల్వర్ ధర కిలోకు రూ.73,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే రూ.5500 పెరిగింది. ప్రస్తుతం కిలోకు రూ.79 వేల మార్కును తాకింది. అంతకుముందు రోజు కిలోకు వెండి రేటు రూ.5300 తగ్గింది.
అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1948 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు 23.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో చూస్తే గనుక రూపాయి మారకం విలువ రూ. 81.948 వద్ద స్థిరంగా ఉంది.
Next Story