రెండు రైళ్లు ఢీ.. 14 రైళ్లు రద్దు
దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రెండు గూడ్సు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి
దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రజలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రెండు గూడ్సు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వండా స్టేషన్లో ఓ రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో గూడ్సు రైలు డ్రైవరుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గూడ్సు రైళ్లు ఖాళీగా ఉన్నాయి. రైళ్లు రెండూ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయన్న విషయంలో స్పష్టత లేదు. ప్రమాదంతో అడ్రా డివిజన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది.