Tue Apr 01 2025 11:30:01 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : శబరిమల భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

శబరిమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్న వారికే ఆరోజు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తుంది. దీనివల్ల భక్తుల రద్దీని నియంత్రించవచ్చని కేరళ ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయించింది. అందుకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఆన్ లైన్ లో బుక్ చసుకున్న
ఆన్లైన్ లో ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలో రోజుకు ఎనభై వేల మందిని మాత్రమే దర్శానికి అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీతో ట్రాఫిక్ నిలిచిపోవడం, భక్తులు ఇబ్బంది పడుతుండటంతో కేరళ హైకోర్టు పలు దఫాలు అక్షింతలు వేసింది. రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
Next Story