Sun Dec 22 2024 21:59:04 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 1,526 పోస్టుల భర్తీ
ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 1,526 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది
ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 1,526 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కు చెందిన పలు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
వివిధ విభాగాల్లో...
ఈ విభాగాల్లో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, వారంెట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జులై ఎనిమిదో తేదీ వరకూ గడువు ఉంది. దీనికి విద్యార్హతగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే కొన్ని పోస్టులకు షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణులయి ఉండాల్సి ఉంది. రాత పరీక్షతో పాటు, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని, వాటి ద్వారా ఎంపిక చేస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://rectt.bsf.gov.in వెబ్సైట్ లో చూసి తెలుసుకోవచ్చు.
Next Story