Sun Mar 16 2025 23:58:17 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru : బెంగళూరులో మాంసం విక్రయాలు బంద్.. రీజన్ ఇదే
కర్ణాటక రాజధాని బెంగళూరులో మాంసం విక్రయాలపై ప్రభుత్వంనిషేధం విధించింది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో మాంసం విక్రయాలపై ప్రభుత్వంనిషేధం విధించింది. బెంగళూరులో వచ్చే నెల 10వ తేద నుంచి 14వ తేదీ వరకూ ఈ ఎయిర్ షో జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిర్ షో నిర్వహణను తీసుకున్న ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భగంగా బెంగళూరు మహా నగర పాలక సంస్థ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. యలహంక ఎయర్ ఫోర్స్ స్టేషన్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న పదమూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా మాంసం విక్రయాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది.
మాంసహారం పై నిషేధం...
మటన్, చికెన్ తో పాటు ఇతర ఎటువంటి విక్రయాలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది.చివరకు మాంసాహారాన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని హోటళ్లలో కూడా వండరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని, ఉత్తర్వులను థిక్కరిస్తే భారీగా జరిమానా విధిస్తామని, అంతే కాదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ ఆంక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ అమలులో ఉంటాయని బెంగళూరు మహా నగర పాలకసంస్థ అధికారులు తెలిపారు. అంటే నెల రోజుల పాటు యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ పదమూడు కిలో మీటర్ల పరిధిలో మాంసం విక్రయాలు ఉండకూడదని చెప్పింది.
ఎయిర్ షో జరుగుతున్నందున...
అయితే ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎయిర్ షోలో అనేక విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేస్తాయి. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అనేక ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు విన్యాసాలు చేస్తాయి. ఈ సందర్భంగా ఆకాశంలో పక్షులు రాకుండా చేసేందుకు బెంగళూరు కార్పొరేన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మాంసం విక్రయాలు జరిగితే అక్కడకు పక్షులు వచ్చి వాలి ఆ పరిధిలో ఆకాశంలో ఎగిరితే అది ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని భావించి ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. గద్దలు, డేగలు వంటివి తగిలితే ప్రమాదాలు జరిగే అవకాశముందని భావించి ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ షో జరిగే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
Next Story