Mon Dec 23 2024 23:37:18 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ కాయిన్ విడుదల
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరిట ప్రభుత్వం వంద రూపాయల వెండి కాయిన్ ను విడుదల చేసింది.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరిట ప్రభుత్వం వంద రూపాయల వెండి కాయిన్ ను విడుదల చేసింది. ఇది ఈరోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట వెండి వంద రూపాయల కాయిన్ ను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
చర్చించిన మీదట...
ఈ మేరకు ఇటీవల మింట్ అధికారులు కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని కలిసి కాయిన్ పై చర్చించారు. వివిధ మోడళ్లను చూపించారు. కాయిన్ పై ముద్రించాల్సిన ఫొటోపై కూడా పురంద్రీశ్వరితో చర్చించారు. అనంతరం కాయిన్ ను ముద్రించి విడుదల చేశారు. వెండి వంద రూపాయల కాయిన్ ఇప్పటి నుంచి ఇక ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story