Tue Nov 19 2024 03:37:12 GMT+0000 (Coordinated Universal Time)
బూస్టర్ డోస్ ను అప్పుడే ఇస్తారట
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ప్రవేశించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ప్రవేశించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే 32 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు కూడా స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు. దీంతో బూస్టర్ డోస్ పై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
తొమ్మిది నెలల తర్వాత....
రెండో డోసు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవచ్చని పార్లమెంటరీ ప్యానెల్ కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే రెండో డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతనే బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ లు కొత్త వేరియంట్ పై పనిచేస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోస్ ను ప్రారంభించారు.
Next Story