అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పోరాటం ఫలించలేదు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పోరాటం ఫలించలేదు. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023ని సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సభలో ఓటింగ్ జరగగా మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ రావడంతో ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యసభలో గట్టెక్కింది. ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. సర్వీస్ వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ అధికారాలను సుప్రీంకోర్టు ఇచ్చిన కొద్ది రోజులకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని ఆప్ ఆరోపించింది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లినా అది సత్ఫలితాలను ఇవ్వలేదు.