పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై అజెండాను విడుదల చేసిన కేంద్రం సర్కార్
ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల అజెండా..
ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటన్నది కేంద్రం విడుదల చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం అజెండాను విడుదల చేసింది. విధాన్ సభ నుంచి మొదలుకొని 75 సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై తొలిరోజున చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే భారత్ సాధించిన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు వంటి వాటిపై చర్చకు రానున్నట్లు తెలిపింది. అంతేకాదు రాజ్యసభలోని మూడు బిల్లులు, లోక్ సభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన కేంద్రం.. ఇందుకు సంబంధించి లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు వేరువేరుగా బులెటిన్ విడుదల చేశాయి. అలాగే ఈ జాబితా తాత్కాలికమేనని.. మరికొన్ని అంశాలను చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. 18వ తేదిన పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.